అమరావతి, సెప్టెంబర్ 5 (కొత్తస్వరం) :
రాష్ట్రంలో ఇటీవలి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర నష్టం జరిగింది రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విన్నపం మేరకు ప్రధాన మంత్రి కేంద్ర బృందాన్ని పంపించారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం నష్టాన్ని అంచనా వేయనున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం.. అంచనా వేస్తారు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి కేంద్ర బృందం.. తెలుసుకొనున్నది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో
కేంద్ర బృందం.. సమీక్ష జరిపింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి అధికారులు.. వివరించారు.