మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద
గాంధీలో బాధితురాలికి పరామర్శ
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (కొత్తస్వరం) :
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో అత్యాచారానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసి మహిళను తెలంగాణ మహిళా కమీషన్ చైర్మన్ నేరెళ్ళ శారద పరామర్శించారు. గాంధీ ఆసుపత్రికి వెల్లిన మహిళా కమిషన్ సంఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు అయిన ఆదివాసి మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని శారదా భరోసా ఇచ్చారు. బాధితురాలికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి వైద్యులకు సూచించారు.