కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్, కొత్తస్వరం :
హీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆదివారం కోహీర్ మండలంలోని పిచేర్యాగడి తాండ(ఎ) లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు శిలాఫలకాన్ని మాజీ మంత్రి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్,ముఖ్య అతిథిగా హాజరైన టెంకాయ కోట్టి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుట్టి పెరిగిన ప్రాంతానికి స్వంతంగా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం స్పూర్తిదాయకమని, ప్రశంశనియమని అన్నారు. సమజంలో మనం చేసే సేవా కార్యక్రమాల వల్లనే తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.పిచేర్యగడి తాండ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా అని,గ్రామంలో వక్ఫ్ భూముల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువేళ్ళీ సమస్యను పరిష్కారిస్తాం అని అన్నారు.గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మిస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి,కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షద్,యేసు, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మక్షుద్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగ్గేల్లి రాములు, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు,కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ,మాజీ వైస్ ఎంపీపీ షాకీర్ అలీ, ఐఎన్.టీయుసీ.ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు రాజ్ కుమార్,కాంగ్రెస్ నాయకులు మోసిన్,కోహిర్ టౌన్ ప్రెసిడెంట్ శంషిర్ అలీ, ముర్జల్,యూత్ కాంగ్రెస్ నాయకులు ముజేమ్మిల్, సురేష్,లాజర్,సాంసన్,తాండ నాయకులు మంగు,నర్సింగ్, విజేందర్,మేఘునాథ్,సూసైటీ డైరెక్టర్ లస్కార్ నాయక్,మాజీ షేవ్య,రవి,రాథోడ్ సంజీవ్ కుమార్,రమేష్,సునీల్,కిషన్,తదితరులు పాల్గొన్నారు.