ఈజిప్టు, సెప్టెంబర్ 18 (కొత్తస్వరం) :
గాస్పల్ టీవీ ఆధ్వర్యంలో శ్యామ్‌యేలు బొజ్జ నిర్వహిస్తున్న 12 రోజులు హోలీలాండ్ టూర్ ప్రారంభమైంది. ఈ టూర్‌లో 40 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్‌యేలు బొజ్జ మాట్లాడుతూ.. జొర్దాన్, ఇశ్రాయేల్, ఈజిప్టు ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతోందన్నారు. బైబిల్ వాక్యానుసార ప్రదేశాలను చూసి ఆధ్యాత్మికంగా బలపడేందుకు వీలుంటుందన్నారు. అనేక మంది టూర్ లో పాల్గొని దైవ ఆశ్వీర్వాదాలు పొందాలని తెలిపారు. ప్రత్యేకంగా క్రైస్తవుల సోదర సోరమణుల కోసం ఈ టూర్ ను ప్రతీ రెండు నెలలకు ఒక సారి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటన దేవుని గురించిన బలమైన విషయాలను తెలుసుకుని దేవుడిలో బలంగా స్థిరపడేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. యేసుక్రీస్తు జన్మంచిన స్థలాలు, పరిచర్య చేసిన ప్రదేశాలు, మోషే నాయకత్వంలో ప్రజలు ఐగుప్తుల బానిసత్వంలో ఉండే ఇశ్రాయేలీయులను బయటకు తీసుకురావడం వంటి అద్భుత విషయాలు తెలుస్తాయన్నారు. ఈ టూర్ లో పాల్గొనే ఆసక్తి గల వారు మమ్మల్నీ సంప్రదించాలని కోరారు.