జర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకోం : సీఎం, డిప్యూటీ సీఎం
అమరావతి, అక్టోబర్ 5 (కొత్తస్వరం) : జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రగా హెచ్చరించారు. ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు సానుకూలంగా స్పందించడంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నాయకులు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.