మేడ్చల్, కొత్తస్వరం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో తండ్రి ఇద్దరు కూతుళ్లను రైలు ఢీ కోట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుడు మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ కి చెందిన కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ చెకింగ్. మ్యాన్ గా చేస్తున్నాడు. .ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పనికి వచ్చాడు కృష్ణ పనిచేస్తుండగా తన కూతురులు రైల్వే పట్టాల పై ఆడుకుంటున్న సమయంలో రైలు అటుగా రావడంతో తన కూతుళ్ల ను గమనించిన కృష్ణ ఇద్దరు కూతుర్లను కాపాడబోయి ముగ్గురు ప్రమాదవశాత్తు రైలు కింద పడి పోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన కూతుర్ల పేర్లు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు.