నందికొట్కూరు, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) : మాండ్ర శివానందరెడ్డి తండ్రి మాండ్ర గిడ్డారెడ్డి వర్ధంతి సందర్భంగా అల్లూరు గ్రామంలో నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య, నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. కార్యక్రమంలో నాయకులు బ్రహ్మానందరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.