జహీరాబాద్, కొత్తస్వరం
శుక్రవారం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పురాని హవేలి సెట్విన్ కార్యాలయంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ యన్.గిరిధర్ రెడ్డి సెట్విన్ రాష్ట్ర చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా వారికీ జహీరాబాద్ అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జి మాజీ వైస్ ఎంపీపీ ఎండి.షాకీర్ అలీ, ఝరాసంగం మండల మాజీ జడ్పీటీసీ వనిల నరేష్,కాంగ్రెస్ నాయకులు అనంత్ నవీన్ కుమార్,నాగిరెడ్డి,లు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.జహీరాబాద్ వాసికి రాష్ట్ర చైర్మన్ పదవి రావడం సంతోషకరమైన విషయం అని నాయకులు అన్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంకు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా,మంత్రిలు కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,అదేవిదంగా మంత్రి వర్గంకు,వారు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.