విజయవాడ, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) : పేదలకు సాయం చేయడంలో స్వాంతన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎప్పుడూ ముందుంటారు. విజయవాడ వరద ప్రమాదం బాధితులకు తమ వంతు సాయంగా ఎందరికో వాటర్ బాటిళ్లు, అన్నం ప్యాకెట్లు, 15 కుటుంబాలకు నిత్యావసరాలు అందించింది. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక సందర్భంలో పేదలకు ఈ సంస్థ తమ వంతు సాయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం ఈ సంస్థ సభ్యులు కొన్ని కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. సాంత్వన సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ భాను ప్రకాష్ మాట్లాడుతూ.. విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన వెయ్యి కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలు అందించే ఈ మిషన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రతి విరాళం లెక్కించబడుతుందని, అందరం చేయి చేయి కలిపి సాయం చేద్దామన్నారు. మరింత సమాచారం కోసం 9700626920 డాక్టర్ భాను ప్రకాష్ ను సంప్రదించాలని కోరారు. వరద ప్రమాద బాధితులు ఇంకా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.