ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (కొత్తస్వరం) :
గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఛత్తీస్ ఘడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళం.