జాఫర్, కొత్తస్వరం న్యూస్ చాగలమర్రి,
మండలంలోని మల్లె వేముల గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్యాధికారిణి అంజలి రోగులను పరీక్షించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని వివిధ కాలనీలలో ఇంటింటికి తిరిగి శిబిరానికి రాలేని రోగులను పరీక్షించి మందులను ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ 104 వైద్య శిబిరాలలో భాగంగా గ్రామాల్లోనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు అన్ని రకాల జబ్బుల ను పరీక్షించి మందుల పంపిణీ చేస్తుందన్నారు. అవసరమైన వారిని జిల్లా కేంద్రం లోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ, ఏఎన్ఎం మంజులమ్మ, హెల్త్ ఎడిటర్ శేఖర్, డీఈఓ హరినాథ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.