మద్యం మత్తులో భార్యను బైక్ కట్టేసి ఈడ్చుకెళ్లిన భర్త
జైపూర్, కొత్తస్వరం న్యూస్
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను బైక్‌కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లిన ఓ ప్రబుధ్దుడి ఘటన నగౌర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నార్సింగపూర్ గ్రామంలో నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పాంచౌడి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ సురేంద్ర కుమార్ తెలిపారు. బైక్‌కు భార్య కట్టడానికి ముందు ఆమెను భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బైక్‌కు కట్టేసిన తర్వాత ఆమెను లాక్కెళ్లాడు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళ బంధువుల వద్ద ఉంటోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు మేఘవాల్ తాగుబోతు అని, ఎప్పుడూ భార్యను కొట్టేవాడని సాక్ష్యులు తెలిపారు. ఎవరితోనూ ఆమె మాట్లాడనివ్వకుండా చేసేవాడని గ్రామస్థులు చెప్పారు.