హైదరాబాద్, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) :
వరదలతో తీవ్ర నష్టం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని చెప్పారు. భవిష్యత్ లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్ ఉండాలని విజ్ఞప్తి సీఎం రేవంత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.