Monday, December 23, 2024
Homeఢిల్లీవైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

నాలుక రంగు ఆధారంగా వ్యాధి నిర్ధార‌ణ‌
98 శాతం క‌చ్చిత‌త్వంతో గుర్తింపు

ఢిల్లీ, కొత్త‌స్వ‌రం
మానవ నాలుక రంగును విశ్లేషించి, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సరికొత్త ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా డయాబెటిస్, స్ట్రోక్, అనీమియా, ఆస్తమా, కాలేయం మరియు పిత్తాశయం సమస్యలు, కోవిడ్-19 వంటి అనేక వ్యాధులను గుర్తించవచ్చు. “నాలుక రంగు, ఆకారం, మందం వంటి లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి,” అని MTU మరియు UniSAలో పరిశోధకులుగా ఉన్న అలీ అల్-నాజీ తెలిపారు. ఈ పరిశోధనలో 5,260 చిత్రాలను ఉపయోగించి మిషన్ లెర్నింగ్ మోడల్ కు శిక్షణ ఇచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం రియల్ టైమ్ డయాగ్నోసిస్‌లో ఉపయోగపడుతూ, వైద్య విధానాలను మరింత ప్రగతిపరచగలదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments