గోల్కొండలో భారీ పురాతన సొరంగం

కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో వెలుగులోకి దాదాపు 400 ఏళ్ల నాటి నిర్మాణంగా గుర్తింపు గోల్కొండ సమీపంలో సొరంగం గుర్తింపు చారిత్రక ప్రాధాన్యంపై అధికారుల పరిశీలన నేడు సొరంగాన్ని పరిశీలించనున్న అధికారులు కొత్త స్వరం, హైదరాబాద్‌, ఆగస్టు 21: హైదరాబాద్‌లో భారీ పురాతన సొరంగం వెలుగులోకి వచ్చింది. గోల్కొండ సమీపంలోని దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో ఈ సొరంగం బయటపడింది. సొరంగం చారిత్రక ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు నేడు సొరంగాన్ని పరిశీలించనున్నారు.