జర్నలిజం.. జర్నలిస్టులను రక్షించాల్సిందే!
ఐజేయూ సెమినార్‌లో వక్తల ఉద్ఘాటన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలి జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిళ్లను అడ్డుకోవాలి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాల రద్దుపై ఆందోళన జర్నలిస్టుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం బెంగళూరు, ఆగస్టు 8 (కొత్త స్వరం): భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. దేశంలో పాలకవర్గాల నియంతృత్వ పోకడలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజాన్ని, జర్నలిస్టులను రక్షించాల్సిన అవసరం మరింత ఉందని పేర్కొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), కర్ణాటక స్టేట్...