ఎండల నుంచి ఉపశమనం..

జపాన్‌లో మనుషుల కోసం ప్రత్యేక 'రిఫ్రిజిరేటర్'టోక్యో, ఆగస్టు 5 (కొత్త‌స్వ‌రం) :ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో రూపొందించిన ఓ వినూత్న పరికరం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 'డో హిమోన్ బాక్స్' అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను జపాన్‌కు చెందిన ట్రుస్కో నకయామా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తగ్గించే లక్ష్యంతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. బయట నుంచి చూస్తే ఇది పెద్ద స్టీల్...