ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన సూపరింటెండెంట్
నూతన బాధ్యతలపై ఎమ్మెల్యే శుభాకాంక్షలు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన మణుగూరు, ఆగస్టు 12 (కొత్త స్వరం): బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనస్తీషియా వైద్య నిపుణులు జి.ప్రసాద్ బుధవారం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన జి.ప్రసాద్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా...