వరుణయాగం ఎందుకు నిర్వహించరు?: భూమన
రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆందోళన తిరుమల జలాశయాలు ఎండిపోతున్నాయని వెల్లడి వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్ వైసీపీ హయాంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేత సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచన తిరుపతి, ఆగస్టు 12 (కొత్తస్వరం): రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని...