మిట్టకందలలో ఉచిత ఆయుష్ వైద్య ఆరోగ్య శిబిరం
ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆయుర్వేదం దోహదం: డాక్టర్ డి. సావిత్రి అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం పాములపాడు, సెప్టెంబర్ 23 (కొత్తస్వరం): పాములపాడు మండలంలోని మిట్టకందల గ్రామంలో అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుష్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. సావిత్రి మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యాధుల నివారణలో ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు....