చీకటి గోపి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరివెళ్ల, సెప్టెంబర్ 25 (కొత్తస్వరం): పోలీసుల వేధింపుల కారణంగా తాడికొండ నియోజకవర్గంలో మృతి చెందిన చీకటి గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి కోరారు. శుక్రవారం సిరివెళ్ల పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యాకాండలు అధికమయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దళిత హోంమంత్రి ఉన్నప్పటికీ...