నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

రాష్ట్రానికి వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఐదు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి విపత్తు నిర్వహణశాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (కొత్తస్వరం): రాష్ట్రంలో పలుచోట్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల...