మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

తిరుపతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : తిరుపతిలో శ్రీ మలయప్పస్వామివారు శనివారం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన మోహనరూపంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.