ఇగ్నోలో ఏడాది మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు
తక్కువ వ్యవధిలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు హైదరాబాద్, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాలయం (ఇగ్నో) వివిధ విభాగాల్లో ఏడాది వ్యవధి గల 11 నూతన మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ఇటీవల ప్రారంభించిందని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్ బి. రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ప్రోగ్రామ్‌లు అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నిర్దేశిత...