చెల్లాపూర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
నెహ్రూ జన్మదిన వేడుకలు నిర్వహణ బాలల భవిష్యత్తుపై ప్రధానోపాధ్యాయుడి సందేశం కుల్కచర్ల, నవంబర్ 14 (కొత్త స్వరం) : మండల పరిధిలోని చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమని, వారిని ఆప్యాయంగా చూసుకునేవారని, అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారని తెలిపారు. నేటి బాలలే రేపటి...