శ్రీ శ్రీ శ్రీ జంబులపరమేశ్వరి దేవి ఆశీస్సులతో..
ఆదివారం రాశి ఫలాలు..
- మేషరాశి..
కుటుంబ సభ్యుల సఖ్యత పెరుగును ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి
వ్యాపారాలలో నూతన లాభాలు అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. - వృషభ రాశి..
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. - మిధునరాశి..
ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ಬುಣ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు. - కర్కాటకరాశి..
గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. - సింహ రాశి..
ఉద్యోగస్తులకునూతన ప్రోత్సాహకాలుఅందుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందంకలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలుకార్యరూపందాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. - కన్యరాశి..
దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. - తుల రాశి..
కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. - వృశ్చికరాశి..
చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకుసాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలుఅనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగాసాగుతాయి. వృథా వ్యాపారాలలో మీ కృషికి తగినఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతనఅవకాశాలు లభిస్తాయి. - ధనస్సురాశి..
ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. - మకరరాశి..
ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. - కుంభరాశి..
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. - మీనరాశి..
అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
(రాశి ఫలాలు నిపుణుల సలహాలతో పాటించండి)
మీ.. శ్రీ కాలభైరవ భేతళ ఉపవాసకులు డక్క జంబులయ్య 9491163914ముఖ్య గమనిక
*జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..*
12 రాశులు, 27 నక్షత్రాలు, 4 పాదాలు.ఒక్కొక్క రాశికి 9 పాదాలు గల ఈ రాశి ఫలాల్లోని విషయాలు ఏ ఒక్కరికో చెందినవిగా భావించి బాధపడవద్దని/అతిగా ఆనందపడవద్దు మీ మీ జాతకాలు నిర్దిష్టముగా తెలుసుకోవాలంటే పుట్టిన తేదీ తదితర వివరాలతో మీ సమీపంలోనిపండితులను సంప్రదించి తెలుసుకోవలసినదిగా మనవి.