కోదాడలో విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
కొత్త స్వరం, ప్రతినిధి కోదాడపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం అభయాంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. కోదాడ ప్రాంత ప్రజలు సుదూర నగరాలకు వెళ్లకుండా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తేస్తున్న కోదాడ ప్రాంత వైద్యులను అభినందించారు. ఆపద సమయంలో వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వైద్యులను సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యశాల యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని. ప్రమీల,పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు,డాక్టర్ సుబ్బారావు,రామారావు, మహబూబ్ జానీ,నల్లపాటి.శ్రీను పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.