మొగిలిపల్లి రామ లక్ష్మయ్య మరణించారేగాని ఆయన కళ్ళు మరొక ఇద్దరికి చూపు ఇచ్చింది
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి
కర్నూలు, ఆగస్టు 14 (కొత్తస్వరం) :
కర్నూల్ నగరం వెంకటరమణ కాలనీ వీసీ ఎన్ క్లేవ్ అపార్టుమెంట్ నందు నివసిస్తున్న మొగిలిపల్లి రామ లక్ష్మయ్య (68) మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో మానవత ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి గారు ఐ డొనేషన్ గురించి వివరించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకున్నారు. వెంటనే ఐ డొనేషన్ ఆఫీసు కు గిడ్డయ్య గారికి ఫోన్ చేస్తే వాళ్ళ సిబ్బందితో వచ్చి రెండు కళ్ళు తీసుకోవడం జరిగింది. కళ్ళు అంటే కేవలం నల్ల గుడ్డు మీద కార్నియా మాత్రమే తీసుకుంటారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపుతున్నాను. ఆ తదుపరి ఐ డొనేషన్ ఆఫీసర్ గిడ్డయ్య గారు చాలా చక్కగా వివరించారు. చనిపోయిన వ్యక్తి 9 గంటల లోపల లేదా ఫ్రీజర్ బాక్స్ లో వచ్చినట్లయితే 24 గంటల లోపల కళ్ళు దానం చేయవచ్చని చక్కగా వివరించారు. ఆ స్పీచ్ విన్న అక్కడికి వచ్చిన వాళ్ళ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా చాలా మంచి పని చేశారు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు ఆ బాధలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక మనిషి మరణించిన ఇద్దరికీ చూపు రావడానికి ముఖ్య కారకులు అయినా గోనూరు యుగంధర్ శక్తిని కొనియాడారు. ఆ తదుపరి యుగంధర్ శెట్టి మాట్లాడుతూ.. మీరు కళ్ళు దానం చేసినట్లయితే ఇద్దరికీ చూపు వస్తుంది చనిపోయిన వ్యక్తికి ఏమాత్రం ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూల్ చైర్మన్,
వారి కుటుంబ సభ్యలకు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు, ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు, తెలియజేశారు.