ఆళ్లగడ్డ, కొత్త స్వరంన్యూస్:
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణం మెయిన్ బజార్లో శబరిష్ బట్టల అంగడి ఎదురుగా ఉన్న నా” టీ “స్టాల్ నిర్వాహకులు వై.నాగరాజు తన దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాఫీ అల్లం టీ హార్లిక్స్, టి, రాగి మార్టు, బెల్లం పాలు, లెమన్ టీ కేవలం కప్పు ఒక్క రూపాయి కె విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దగ్గరకు వచ్చేఅన్ని వర్గాల ప్రజలకు టీ, కాఫీ బూస్ట్ బెల్లం పాలు,సొంటి, రాగి మాల్ టు, లెమన్ టీ ఏదైనా సరే ఒక్క రూపాయి మాత్రమే విక్రయిస్తున్నానన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.