- యూనియన్ జిల్లా నేత జయప్రకాష్ డిమాండ్
జోగులాంబ గద్వాల, ఆగస్టు 22 (కొత్తస్వరం) :
భారతదేశంలోని కోల్ కతా లోని ఆర్ జీ కార్ వైద్య శాలలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలును మట్టుపెట్టాలని తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్(ఐ ఎన్ టి యు సి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధిస్తే భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన మాట్లాడుతూ అన్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి వృద్ధాప్యం లో ఉన్న మహిళల పై అత్యాచారానికి పాల్పడుతున్న మనిషి రూపము లో ఉన్న మానవ మృగాలను వెంటాడి వేటాడి పట్టుకొని న్యాయ స్థానం లో నిలువబెట్టి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, వారిని ఉరి తీయాలని యూనియన్ జిల్లాఅధ్యక్షులు జయప్రకాశ్ డిమాండ్ చేశారు.