హైదరాబాద్, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) :
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం బాధాకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి సామాన్య, అణగారిన వర్గాల ప్రజల గొంతుకగా ఉన్నారని కితాబునిచ్చారు. సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.