నందికొట్కూరు, సెప్టెంబర్ 14 (కొత్తస్వరం) : అల్లూరు గ్రామ డ్రైనేజీ కాలువ పనులను నందికొట్కూరు నియోజవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, సున్నంపల్లి శ్రీను, పెద్దరాజు, చిన్నరాజు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.