నందికొట్కూరు, అక్టోబర్ 4 (కొత్తస్వరం) :
నాటు సారా స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ పర్యవేక్షణలో ఈ దాడులు జరిపినట్టు నందికొట్కూరు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి క్యూఆర్ టీ టీంతో కలిసి పట్టణంలోని షికారి పేటలో దాడులు నిర్వహించి 1500 లీటర్లు నాటు సారా ఊట, సారా తయారీకి సంబంధించిన సామగ్రి ని ధ్వంసం చేసి.. 50 లీటర్ల నాటు సారా సీజ్ చేసినట్టు తెలిపారు.