25.1 C
Hyderabad
Homeతాజా వార్తలుఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం

ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం

హైకోర్టు గడువులోగా నోటిఫికేషన్ జారీ
ఎస్‌ఐఆర్ పూర్తయితే కొత్త ఓటర్ల జాబితా
ప్రక్రియ పూర్తి కాకుంటే పాత జాబితాతోనే ఎన్నికలు
ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల నిర్వహణకు స్పష్టత
ఢిల్లీ, అక్టోబర్ 9 (కొత్త స్వరం ) :
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన ఆరు వారాల గడువులోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయితే, కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎస్‌ఐఆర్ ప్రక్రియ అప్పటికి పూర్తికాకపోతే, పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితాపై స్పష్టత లభించింది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.