రామదాసు సాహితీ కళా సేవ సంస్థ
ఆధ్వర్యంలో పోలయ్య కవి కూకట్లపల్లికి
“సాహిత్య ధీర” బిరుదు ప్రదానం…
హైదరాబాద్ చిక్కడపల్లి:
శ్రీ త్యాగరాజ గానసభలో ఆదివారం
రామదాసు సాహితీ కళా సేవ సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సభ…సీనియర్ కవి డా.రామచంద్ర మౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డా.రవీంద్ర
బాబు అరవా సమన్వయకర్తలుగా “రాముని మార్గం…కృష్ణుని తత్వం” అంశంగా
కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు
భక్తి రస భరిత కవితలు వినిపించారు…
ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కమ్మని
కవితను ఆలపించినందుకు…దాదాపుగా
4000 కవితలు వ్రాసినందుకు గుర్తింపుగా
సంస్థ అధ్యక్షులు డా.దూత రామకోటేశ్వర
రావు పోలయ్య కవి కూకట్లపల్లికి…
“సాహిత్య ధీర” బిరుదును ప్రదానం చేశారు.
డా.విడి రాజగోపాల్..డా.రామచంద్రమౌళి డా.రాధా కుసుమ తదితర సాహితీ
మూర్తులు పోలయ్య కవి కూకట్లపల్లిని శాలువా…మెమోంటోతో ఘనంగా సత్కరించారు…కవి కూకట్లపల్లి
అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు…
ఈ సభలో సంస్థ వ్యవస్థాపకులు
దూత రామకోశ్వరావు వ్రాసిన…”
“నాన్నా బ్రో”…”పాలేరు నుండి పర్ణశాల వరకు”…”సన్మాన కవితామృతం”
పుస్తకాలను ముఖ్యఅతిథి విశ్రాంత
డైరెక్టర్ మైన్స్ మహర్షి వాల్మీకి సంస్థ గౌరవాధ్యక్షులు డా.విడి రాజగోపాల్…
సభాధ్యక్షులు డా.రామ చంద్రమౌళి ఆవిష్కరించారు
ముఖ్య అతిథి డా.వి.డి రాజగోపాల్
మాట్లాడుతూ “ఆథ్యాత్మిక సామాజిక
అంశాలపైనే కాకుండా ప్రభుత్వపాలకుల
అవినీతి మీద…సమాజంలోని రుగ్మతల
మీద కవులు విరుచుకుపడాలని”
గొప్ప సందేశం ఇచ్చారు…
తదనంతరం ముఖ్య విశిష్ట ఆత్మీయ
అథితులతో పాటుగా కవితలు చదివిన దాదాపుగా 69 మంది కవులకు కవయిత్రులకు వినూత్నంగా ఒక్కొక్కరికి “ఒక బిరుదును” ప్రదానం చేస్తు ఘనంగా సన్మానించారు.
ఈ సభలో…విశిష్ట అతిథిగా ట్రాఫిక్
అడిషనల్ డిజిపి తేజావత్ రామదాసు
ఆత్మీయ అతిథులుగా భీమా…చంద్రశేఖర్
మోటూరి…గజవెళ్ళి…అన్నదాత శీనమ్మ రామకోశ్వర రావు సతిమణి పిల్లలు కావ్య
కళ్యాణి పాల్గొని సభను కమ్మని విందుతో విజయవంతం చేశారు