నందికొట్కూరు, ఫిబ్రవరి 10 (కొత్తస్వరం) :
నందికొట్కూరు పట్టణం పగిడ్యాల క్రాస్ రోడ్డు నందు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జీ గౌరు వెంకట్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, నందికొట్కూరు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, విగ్రహదాత కిరణ్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.