- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎండీ రఫీ
నంద్యాల, కొత్తస్వరం
గత నాలుగు రోజులు క్రితం గెలివి ఇండస్ట్రీస్ అధినేత రామకృష్ణ సొంత స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెళ్లి మళ్లీ అతని పైనే దాడి చేయించిన దోషులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎండీ రఫీ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా అయినప్పటినుండి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కొందరు దళారులు ఖాళీగా ఉన్న స్థలాలను దౌర్జన్యంగా కబ్జాలు చేస్తూ ఈ స్థలం నాదే అంటూ చెబుతూ ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. అలాంటి వారి పైన తక్షణమే రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మినిస్టర్ ఫరూక్ , జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అలాంటి వారపైన కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.