





– ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల, కొత్తస్వరం
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పి అన్నారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. విఘ్నాలకు అధిపతి అయిన విజ్ఞేశ్వరుడి కరుణ, కటాక్షాలు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ గణనాథుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.