24.7 C
Hyderabad
Homeతాజా వార్తలుగజపతినగరంలో వైఎస్సార్‌సీపీలోకి 150 కుటుంబాలు

గజపతినగరంలో వైఎస్సార్‌సీపీలోకి 150 కుటుంబాలు

టీడీపీకి చెందిన కుటుంబాల చేరిక

బొత్స సత్యనారాయణ సమక్షంలో కార్యక్రమం

కండువాలు కప్పి ఆహ్వానించిన నేతలు

బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో చేరికలు

పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

గజపతినగరం, అక్టోబర్ 19 (కొత్త స్వరం): విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఊపు లభించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 150 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, బొడ్డు రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపాలెం, పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ చేరికలు గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.