24.7 C
Hyderabad
HomeUncategorizedఎన్నికల శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయుల సస్పెన్షన్

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయుల సస్పెన్షన్

  • గుంటూరు జిల్లాలో కలెక్టర్ చర్యలు
  • శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై వేటు
  • ముందస్తు సమాచారం లేకుండానే గైర్హాజరు
  • సీసీఎస్ నిబంధనల ప్రకారం ఉత్తర్వులు
  • అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదు

గుంటూరు, అక్టోబర్ 19 (కొత్త స్వరం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు, 2026 గుంటూరు జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు నియమితులైన ప్రెసిడింగ్ అధికారులు (POs), సహాయ ప్రెసిడింగ్ అధికారులు (APOs) కోసం ఈ నెల 17న నిర్వహించిన శిక్షణ తరగతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీలు) నిబంధనలు, 1991లోని రూల్ 8(1) ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి లేకుండా తమ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. అలాగే, నిబంధనల ప్రకారం వారికి జీవన భృతి పొందే అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.