30.3 C
Hyderabad
Homeతెలంగాణబెల్లం టీతో.. సార్‌ సింప్లిసిటీకి సలాం

బెల్లం టీతో.. సార్‌ సింప్లిసిటీకి సలాం

  • హైక్లాస్‌ జీవనశైలిలోనూ.. సాధారణతకు పెద్దపీట
  • రోడ్డు పక్కన బెల్లం టీ ఆస్వాదించిన న్యూట్రిషనిస్ట్‌..
  • ఉదయం టిఫిన్‌ నుంచి బయట భోజనం వరకు నిరాడంబరతే తీరు
  • అందరితో ఆప్యాయంగా మెలగడమే డాక్టర్‌ కంకటి రవీందర్‌ ప్రత్యేకత
  • నాయకత్వంలోనూ కనిపిస్తున్న నిరాడంబరత

హైదరాబాద్‌, ఆగస్టు 15 (కొత్తస్వరం న్యూస్):
బయటకు చూస్తే ఉన్నత జీవనశైలి, ఆర్థికంగా మంచి స్థితి, వృత్తిపరంగా న్యూట్రిషనిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ ప్రముఖ వ్యాపారవేత్త, న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌ కంకటి రవీందర్‌లో ఎలాంటి గర్వం కనిపించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఉదయం ఇంట్లో టిఫిన్‌ చేసినా.. మధ్యాహ్నం బయట భోజనం చేసినా.. ఆహారం, వాతావరణం, వ్యక్తుల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం చూపకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆయన నిరాడంబరతకు నిదర్శనంగా కనిపిస్తోంది.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ లక్డీకాపూల్‌కు వెళ్లిన సందర్భంగా రోడ్డు పక్కన సాధారణంగా లభించే బెల్లం టీని ఆస్వాదిస్తూ కనిపించిన ఆయన తీరు.. పలువురిని ఆకట్టుకుంది. సౌకర్యవంతమైన జీవితం గడిపే స్థాయి ఉన్నప్పటికీ సాధారణ ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, మంచి రిసీవింగ్‌తో వ్యవహరించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది.. ఎంత ఎదిగినా సామాన్యుడి ఆత్మీయతను మరచిపోకూడదనే భావనకు ఆయన ప్రవర్తన నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.. ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సాధారణ స్థాయి వారితో ఎలాంటి భేదభావం లేకుండా కలిసిపోయే మనస్తత్వం ఆయనలోని గొప్పతనాన్ని చాటుతోంది.. నాయకత్వం అంటే కేవలం ముందుండి నడిపించడం మాత్రమే కాదని.. అందరినీ గౌరవిస్తూ ఆత్మీయంగా మెలగడమే నిజమైన నాయకత్వమని ఆయన వ్యవహారశైలి చాటుతోంది.. రోడ్డు పక్కన ఓ సాధారణ బెల్లం టీతో కనిపించిన ఈ చిన్న సందర్భం డాక్టర్‌ కంకటి రవీందర్‌లోని పెద్ద మనసును, సింప్లిసిటీని మరోసారి పరిచయం చేసింది..

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.