30.3 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్సేవలపై అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో తెలియజేయాలి

సేవలపై అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో తెలియజేయాలి

  • ప్రజల సూచనలతో సేవల నాణ్యత మరింత మెరుగుపరుస్తాం: కలెక్టర్ రాజకుమారి గణియా


నంద్యాల, ఆగస్టు 16 (కొత్తస్వరం) :
ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Public Grievance Redressal System–PGRS)పై ప్రజలు విస్తృతంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు తమకు అందిన సేవలు, సమస్యల పరిష్కారంపై తమ అభిప్రాయాలను PGRS Feedback ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఇందుకోసం https://pgrs.ap.gov.in/Home/QRGGrievanceFeedback వెబ్‌సైట్‌ను సందర్శించడంతో పాటు అందుబాటులో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి తమ ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంలో వారి అభిప్రాయాలు ఎంతో కీలకమని, సేవలపై సంతృప్తి, సూచనలు లేదా ఇతర అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో తెలియజేయాలని కోరారు. ప్రజల నుంచి అందే ఫీడ్‌బ్యాక్‌ను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా, సమర్థంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. డీఐపీఆర్‌ఓ, నంద్యాల.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.