త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలన
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ
సీల్‌లు, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం
భద్రతలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తత
నంద్యాల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
త్రైమాసిక తనిఖీలో భాగంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల్లోని భద్రతా ఏర్పాట్లు, సీల్‌లు, రక్షణ చర్యలను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న తీరును తనిఖీ చేశారు. గోదాముల పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను కూడా పరిశీలించిన ఆమె, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్‌తో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశం పార్టీ తరఫున శివరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాయిరాం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రదీప్, సీపీఐ తరఫున నరసింహులు తదితర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈవీఎం గోదాముల భద్రతపై కలెక్టర్ తనిఖీ
