32.2 C
Hyderabad
Homeతాజా వార్తలుకొత్త స్వరం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కొత్త స్వరం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

  • ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తేవాలి
  • మీడియా కీలక పాత్ర పోషించాలి
  • బీసీ వర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి
  • సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (కొత్త స్వరం): తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో “కొత్త స్వరం” వార్త దినపత్రికను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రిక సంపాదక వర్గాన్ని ఆయన అభినందిస్తూ, సమాజంలోని ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై నిష్పాక్షికంగా వార్తలను అందించే వేదికగా “కొత్త స్వరం” పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలు, బీసీ వర్గాల ఆకాంక్షలు, సామాజిక న్యాయం వంటి అంశాలకు పత్రికలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, నగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అంజి, పార్టీ నాయకులు, పత్రిక ప్రతినిధులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.