25.1 C
Hyderabad
Homeతాజా వార్తలుకొత్త పార్టీలోకి ఓవీ రమణకు విజయసాయిరెడ్డి ఆహ్వానం

కొత్త పార్టీలోకి ఓవీ రమణకు విజయసాయిరెడ్డి ఆహ్వానం

కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు తిరుమల శ్రీవారి దర్శనం

ఓవీ రమణ కలిసి రావాలని బహిరంగ పిలుపు

టీటీడీ బోర్డులో కలిసి పనిచేసిన అనుభవం

ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి

వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి విజ్ఞప్తి

తిరుమల, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. త్వరలో ప్రారంభించనున్న పార్టీలోకి తన మిత్రుడు, టీటీడీ మాజీ సభ్యుడు ఓవీ రమణను ఆయన బహిరంగంగా ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి, కొత్త పార్టీ ప్రారంభించనున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో తాను, ఓవీ రమణ నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త పార్టీలోనూ ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. జీయర్ స్వామి, ఇతర పీఠాధిపతుల ఆకాంక్ష మేరకు ఈ నిర్మాణం చేపట్టాలని కోరారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, కీలక నేతలను సంప్రదిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.