29.8 C
Hyderabad
Homeజాతీయంప్రకాశ్‌ రాజ్ ఓటు తొలగింపుపై ఈసీ క్లారిటీ

ప్రకాశ్‌ రాజ్ ఓటు తొలగింపుపై ఈసీ క్లారిటీ

  • ఏకపక్షంగా ఓటు తొలగించలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం
  • ఓటర్‌ ఐడీలోని చిరునామాకు వెళ్లిన అధికారులు
  • నాలుగేళ్ల క్రితమే చిరునామా నుంచి మారినట్లు గుర్తింపు
  • ప్రస్తుతం మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్ అంగీకారం
  • నిబంధనల ప్రకారమే ఓటు తొలగింపు ప్రక్రియ

కొత్తస్వరం, ఢిల్లీ
నటుడు ప్రకాశ్‌ రాజ్ ఓటు తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. తన సొంత ఊర్లో ఓటు తొలగించారని ప్రకాశ్‌ రాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ అధికారులు స్పందించారు. ప్రకాశ్‌ రాజ్‌ ఓటును ఏకపక్షంగా తొలగించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయన ఓటర్‌ ఐడీలో నమోదైన చిరునామాకు ఎన్నికల అధికారులు వెళ్లి పరిశీలన చేపట్టినట్లు తెలిపింది. పరిశీలనలో ప్రకాశ్‌ రాజ్‌ నాలుగేళ్ల క్రితమే ఓటర్‌ ఐడీలో నమోదైన చిరునామా నుంచి మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ కూడా అంగీకరించినట్లు ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఓటు తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.