కస్టమ్స్ సుంకం తగ్గించిన కేంద్రం
ముడి, రిఫైన్డ్ నూనెలపై బీసీడీ కోత
సెప్టెంబర్ 24 నుంచే అమలు
దేశీయ మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం
ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ
దిల్లీ, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్‌లోని ముడి, రిఫైన్డ్ నూనె రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) కేంద్ర ప్రభుత్వం బుధవారం తగ్గించింది. దీంతో దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెపై బీసీడీని 10 శాతం నుంచి సున్నాకు, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు పువ్వు నూనెపై 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించింది. అలాగే ముడి సోయాబీన్ నూనె, పామాయిల్‌పై బీసీడీని 10 శాతం నుంచి 5 శాతానికి, రిఫైన్డ్ సోయాబీన్, పామాయిల్‌పై 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించింది. ఈ సుంకం తగ్గింపులు సెప్టెంబర్ 24 నుంచే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
