26.7 C
Hyderabad
Homeతాజా వార్తలు9 నెలల్లో 1.76 లక్షల ఉద్యోగాల కోత

9 నెలల్లో 1.76 లక్షల ఉద్యోగాల కోత

  • ఏఐతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం
    టెక్నాలజీ నుంచి బ్యాంకింగ్‌ వరకు ప్రభావం
    ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులతో కోతలు
    ఏఐ పెట్టుబడులూ ఒక కారణమే
    మైక్రోసాఫ్ట్‌లో ఆరోసారి ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (కొత్తస్వరం): ప్రపంచవ్యాప్తంగా 2026లో ఉద్యోగాల కోతలు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, రిటైల్‌, మీడియా, గేమింగ్‌ తదితర రంగాలకూ విస్తరించాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం, వ్యాపార నమూనాలను మార్చుకోవడం, కృత్రిమ మేధ (ఏఐ)లో పెట్టుబడులు పెంచడం వంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. జనవరి 1 నుంచి సెప్టెంబర్‌ 23 వరకు వెల్లడైన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 1.76 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి. అమెజాన్‌, అట్లాసియన్‌, ఇంట్యూట్‌ వంటి సంస్థలు ఏఐలో పెట్టుబడులు, సంస్థాగత మార్పులను ఉద్యోగాల కోతలకు కారణాలుగా పేర్కొన్నాయి. అయితే ప్రతి ఉద్యోగ కోతకు ఏఐనే కారణమని చెప్పడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలహీనమైన డిమాండ్‌, అధిక నిర్వహణ వ్యయాలు, కొవిడ్‌ తర్వాత అధిక నియామకాలు, మారుతున్న వ్యాపార విధానాలు, ఉత్పాదకత పెంచాల్సిన ఒత్తిడి కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్‌లో మరో విడత ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సుమారు 500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. వీరిలో ఎక్కువమంది ఎక్స్‌బాక్స్‌ గేమింగ్‌ విభాగానికి చెందినవారు కాగా, క్లౌడ్‌, కృత్రిమ మేధ విభాగాల్లోనూ కొద్దిమంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. జూలైలో మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 2.1 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.