26.7 C
Hyderabad
Homeతాజా వార్తలుఇగ్నోలో ఏడాది మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు

ఇగ్నోలో ఏడాది మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు

  • తక్కువ వ్యవధిలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం
    వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (కొత్తస్వరం): ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాలయం (ఇగ్నో) వివిధ విభాగాల్లో ఏడాది వ్యవధి గల 11 నూతన మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ఇటీవల ప్రారంభించిందని ఇగ్నో హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ బి. రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తక్కువ వ్యవధిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ప్రోగ్రామ్‌లు అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నిర్దేశిత అర్హత ప్రమాణాలకు లోబడి ఈ మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ www.ignou.ac.in ను సందర్శించి ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్‌ బి. రాజు సూచించారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.