24.7 C
Hyderabad
Homeతాజా వార్తలుసెప్టెంబర్ 25న తెలంగాణ హైకోర్టుకు సెలవు

సెప్టెంబర్ 25న తెలంగాణ హైకోర్టుకు సెలవు

గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా సెలవు

తెలంగాణ హైకోర్టుకు వర్తించే సెలవు

హైదరాబాద్–సికింద్రాబాద్ కోర్టులకు కూడా

మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి కోర్టులకు వర్తింపు

డిసెంబర్ 5న కోర్టు వర్కింగ్ డేగా ప్రకటన

కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా సెప్టెంబర్ 25, 2026 శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటించారు. అదే విధంగా హైదరాబాద్–సికింద్రాబాద్ పరిధిలోని కోర్టులు, మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సంబంధిత కోర్టులకు కూడా ఆ రోజు సెలవు వర్తించనుంది. గణేష్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 25న ప్రకటించిన సెలవుకు ప్రత్యామ్నాయంగా డిసెంబర్ 5, 2026 శనివారాన్ని తెలంగాణ హైకోర్టుకు కోర్టు వర్కింగ్ డేగా ప్రకటించారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.